న్యూ డిల్లీ ఆగష్టు 9 (way2newstv.com):
జమ్ముకశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను అందిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాకిస్థాన్ దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. భారత్ పై తన అక్కసును అంతర్జాతీయ వేదికలపై వెళ్లగక్కేందుకు యత్నిస్తోంది. ఇదే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి లేఖ రాసింది. ఈ లేఖపై స్పందించాల్సిందిగా భద్రతామండలి అధ్యక్షురాలు జోనాను మీడియా కోరగా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.
ఆర్టికల్ 370 రద్దు పాక్ లేఖపై 'నో కామెంట్':ఐరాసా
'నో కామెంట్స్' అంటూ నిష్క్రమించారు.మరోవైపు, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్టెరెస్ కు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ లేఖ రాశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భద్రతామండలి తీర్మానాన్ని భారత్ ఉల్లంఘించిందని లేఖలో ఆరోపించారు. అంతకు ముందు ఆంటోనియో మాట్లాడుతూ, ఇండియా, పాకిస్థాన్ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.