సుష్మాకు 51 దేశాల నివాళి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సుష్మాకు 51 దేశాల నివాళి

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (way2newstv.com)
భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మృతిపట్ల 51 దేశాల దౌత్యవేత్తలు నివాళులర్పించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో సుష్మా ఫోటోకు నివాళులర్పించిన దౌత్యవేత్తలు.. అక్కడున్న పుస్తకంలో సంతాప సందేశం రాశారు. ప్రపంచంలోని పలు దేశాల దౌత్యవేత్తలు.. సుష్మా మృతి పట్ల నివాళులర్పించి.. 
సుష్మాకు 51 దేశాల నివాళి

సంతాప సందేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం గొప్ప విషయమని పేర్కొంటూ యూఎన్‌లోని భారత అంబాసిడర్‌ సయీద్‌ అక్బరుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. 2014 నుంచి 2019 వరకు నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ సేవలందించిన విషయం విదితమే. సంతాపం సందేశం తెలిపిన దేశాలు.. రష్యా, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, స్విట్జర్లాండ్‌, అర్జెంటీనా, బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, బోట్స్‌వానా, దక్షిణ కొరియా, ఈజిప్ట్‌, ఫిజి, జార్జియా, ఘానా, కెన్యా, మలేషియా, మాల్దీవులు, మల్టా, మయన్మార్‌, నేపాల్‌, న్యూజిలాండ్‌, సింగపూర్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌, ఇజ్రాయెల్‌, యూఏఈతో పాటు పలు దేశాలు ఉన్నాయి.