హైద్రాబాద్, ఆగస్టు 1, (way2newstv.com)
ముఖ్యమంత్రి జగన్ ఇపుడు మరోసారి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. జెరూసలెం పర్యటన తర్వాత ఆయన తిరిగొచ్చాక ఆగస్టు 6, 7 తేదీల్లో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులనూ కలుస్తారట. జగన్ సీఎం అయిన తరువాత తన తొలి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కొందరు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఆ పర్యటన ఏం ఫలితాలు ఇవ్వలేదు. ప్రత్యేకహోదా, ప్యాకేజీ, విశాఖ రైల్వేజోన్ రివిజన్, అమరావతి, పోలవరం ఇలా ఏ అంశంలోనూ సత్ఫలితాలు కనిపించలేదు.
6,7 తేదీల్లో జగన్ ఢిల్లీ టూర్
ఉత్తచేతుల్తో జగన్ తిరిగి వచ్చారు. అయితే... ఇక ఢిల్లీ వచ్చిన ప్రతిసారి కచ్చితంగా ప్రత్యేక హోదాను అడుగుతాను అని జగన్ అపుడు వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు చేసింది కూడా అదే కదా... ఆయనపై ఎందుకు విమర్శలు చేశారు అని అనుమానించకండి... జగన్ ఈజ్ రైట్ అంతే.మోడీకి - జగన్ కి మంచి సంబంధాలున్నాయని చెప్పుకోవడమే గాని... మోడీ అధికారం చేపట్టాక కేంద్రం నుంచి అతి తక్కువ నిధులు వచ్చింది జగన్ వచ్చిన తర్వాత కేంద్రం పెట్టిన బడ్జెట్లోనే. అంటే తన ఫ్రెండ్ సీఎం అయ్యాక ఏమీ అడగడు అని అదేపనిగా అన్యాయం చేసినట్లు 22 మంది ఎంపీలకు ఒక్కొక్కరు కోటి పంచుకోమన్నట్లు అంతే నెంబరు వచ్చేలా బడ్జెట్ లో మోడీ నిధులు కేటాయించారు. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే... చరిత్రలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అతి తక్కువ నిధులు వచ్చింది ఈసారే. బీజేపీతో సఖ్యంగా కనిపించే వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో ఇక ఏపీకి పండగే అని భావించిన వైసీపియన్ల కలలు నెలరోజుల్లోనే కూలిపోయాయి. బాబున్నపుడైనా కాసిన్ని విదిల్చిన మోడీ ఇపుడు అసలుకే ఎసరు తెచ్చారు. జగన్ తొలి పర్యటనకు, ఇప్పుడు చేయబోయే రెండో పర్యటనకు మధ్య చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ - వైసీపీ సంబంధాల్లో తేడా వచ్చింది. ఒకవైపు 2024కి ఏపీ తమ లక్ష్యం కాదని చెప్పిన బీజేపీ ప్లాన్ మార్చింది. జగన్ తమకు ఎంత మాత్రమూ సింక్ కాడని అర్థం చేసుకుంది. అందుకే చాపకింద నీరులా ఏపీలో విస్తరణ మొదలుపెట్టింది. పైగా బీజేపీకి నచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగన్ గట్టిగా అండ ఇస్తున్నాడు. ఇంకో వైపు చంద్రబాబును దెబ్బకొట్టేందుకు జగన్ చేస్తున్న పనులు పరోక్షంగా బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పీపీఏల విషయంలో జగన్ పై రద్దు విషయంలో కేంద్రం రెండు సార్లు చెప్పినా వినకపోవడం వారికి కోపం తెప్పించింది. దీన్ని బట్టి జగన్ ఢిల్లీ పర్యటన ప్లాఫ్ అవడం ఖాయమే.
Tags:
telangananews