వరంగల్ అర్బన్, ఆగస్టు 13,(way2newstv.com):
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 15న ఉదయం 8 గంటలలోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ఆదేశించారు.
8 గంటలలోపు జెండా ఎగురవేయాలి
అనంతరం హన్మకొండ లోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఉదయం 10 గంటలకు నిర్వహించే జిల్లాస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. అధికారులు తమ కార్యాలయ పరిధిలోని ఉద్యోగులను కూడా జిల్లాస్థాయి వేడుకలకు తీసుకొని రావాలని తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అధికారులు ఉదయం 9.30 గంటల లోపు హాజరు నమెదుకు ప్రత్యేక రిజిష్టర్ లో సంతకము చేయాలని కలెక్టర్ తెలిపారు.
Tags:
telangananews