కాక రేపుతున్న కాపు రిజర్వేషన్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాక రేపుతున్న కాపు రిజర్వేషన్లు

కాకినాడ, ఆగస్టు 1, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కాకరేపుతున్న కాపు రిజర్వేషన్ ల అంశంపై అధికార వైసిపి పన్నిన ఉచ్చులో టిడిపి చిక్కుకుందా ? అవునంటున్నారు విశ్లేషకులు. తేనెతుట్టె లాంటి కాపు రిజర్వేషన్ల అంశం సున్నితమైనది. దాన్ని తాకినప్పుడల్లా అధికారంలో వున్న వారికి షాక్ కొడుతూ వస్తుంది. అయినా కానీ జగన్ వివాదానికి ఎదురెళ్ళారు. అలా చేయడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో బాబు కాపులకు చేసిన మోసాన్ని బయట పెట్టాలన్నదే జగన్ టార్గెట్ అంటున్నారు. కాపు లకు ఈ బి సి కోటాలో ఐదు శాతం కోటాను అధికారపార్టీ తొలగించింది. ఎన్నికలకు ముందు టిడిపి సాధ్యం కాని వ్యవహారాన్ని నడిపించి ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరతీసింది.
కాక రేపుతున్న కాపు రిజర్వేషన్లు

చంద్రబాబు సర్కార్ గతంలో కేంద్రం ఇచ్చిన అగ్రవర్ణ రిజర్వేషన్ల కొటా కు కన్నం పెట్టి బిసిల్లో చేరుస్తామన్న కాపులకు ఐదు శాతం ప్రకటించేసింది. ఇది మిగిలిన అగ్రవర్ణాల్లో చిచ్చు రేపింది. వారు ఇది చెల్లదంటూ కోర్టు ను ఆశ్రయించారు. కొనసాగించాలని మరికొంటారు కోర్టు కెక్కారు. ఇలా ఈబిసి కోటాపై కూడా న్యాయస్థానాల్లో లిటిగేషన్ మొదలు కావడంతో కాపు సామాజికవర్గంలో ఆందోళన మొదలైంది. దాంతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి సీన్ లోకి దిగారు. కాపు రిజర్వేషన్ల పై వైసిపి వైఖరి తేల్చాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు నేరుగా బహిరంగ లేఖ రాశారు. దాంతో జగన్ కాపు నేతలతో భేటీ అయ్యారు. మంత్రులు కన్నబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు లతో కూడిన కమిటీని జగన్ నియమించారు. వీరు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లు, న్యాయస్థానం లో ఇబ్బందులు, ఎలాంటి వైఖరి వహించాలి వంటి అంశాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.కాపు రిజర్వేష్లలపై తమ ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం కోటా జగన్ సర్కార్ తీసేయడాన్ని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అసెంబ్లీలో తప్పుపట్టారు. అంతే అధికార పక్షం దీనికోసమే చూస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం కాపులను ఎలా మోసగించింది, అబద్ధాలతో సరిపెట్టిన అంశాలు ప్రస్తావించి టిడిపిని ఇరుకున పెట్టారు. కాపులకు చంద్రబాబు తన మ్యానిఫెస్టో లో చెప్పినవన్నీ చేస్తే ఇప్పుడు సమస్య ఎందుకు ఉంటుందని వైసిపి ఎమ్యెల్యే అంబటి ప్రశ్నించారు. ఆచరణ సాధ్యంకాని హామీలు జగన్ ఇవ్వలేదని చెప్పిందే చేస్తున్నామని దుమ్మెత్తిపోశారు. కాపుల అంశంలో టిడిపి ఎంత దూకుడు గా వెళితే వైసిపి అంతే స్థాయిలో గతాన్ని తవ్వి ఎండగట్టాలని తద్వారా తెలుగుదేశం కాపులకు చేసిందేమి లేదన్నది వివరించాలని వైసిపి వ్యూహంలో ఇప్పుడు టిడిపి చిక్కుకుంది. దాంతో ఈ వ్యవహారం పై ఎంత రచ్చ జరిగితే అంత మంచిది అని భావిస్తున్న అందుకే కమిటీ ని ఏర్పాటు చేసి, సుదీర్ఘ కాలం సాగతీసి ఒక పక్క విపక్షానికి మరోపక్క కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాలకు చెక్ పెట్టాలని అధికారపక్షం లెక్కంటున్నారు విశ్లేషకులు.