ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

రాజమహేంద్రవరం ఆగస్టు 08,(way2newstv.com)
ఎగువ ప్రాంతాల్లో కురుసున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. 
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

దీంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. డెల్టాకాల్వలకు 7000క్యసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వరద నిలకడగా ఉంది. పోలవరం, వేలేరుపాడు మండలంలోని 36 గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.
Previous Post Next Post