కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోసైటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోసైటీ

వరంగల్లు అర్బన్, ఆగస్టు 07,(globelmedianews.com - Swamy Naidu):
పేషెంట్లను ఇబ్బంది పెట్టకుండా సకాలంలో మెరుగైన సేవలను అందించాలని ఎం.జి.ఎం. కాట్రాక్ట్ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. ఎం.జి.ఎం.లో 2002 నుండి 18 విభాగాలలో పనిచేస్తున్న 138 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ సహకారంతో ఎం.జి.ఎం హాస్పిటల్ మెడికల్ అండ్ హెల్తె కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ సొసైటీగా ఏర్పాడి ప్రభుత్వం  నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేయించారు. బ్యాంక్ ఖాతాలు, ప్రావిడెంట్ ఫండ్, ఇ.ఎస్.ఐ.సదుపాయాలను సొసైటి ద్వారా పొందేవిధంగా ఏర్పాటు చేశారు. ఎం.జి.ఎం.లో సొసైటి తరపున పారామెడికల్ విధులు నిర్వహించుటకు లేబర్ లైసెన్స్ ను కూడా పొందారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోసైటీ
ఈ సొసైటీని ఎంపానల్ లిస్ట్ లో చేర్పించారు. ఎం.జి.ఎం.లో పారా మెడికల్ సేవలు పొందుటకు నిర్వహించిన ప్రిక్రియలో పాల్గొని, ఒప్పందం  చేసుకున్నారు. దీర్ఘకాలం  నుండి పనిచేస్తున్న తమకు  పారా మెడికల్ విధులు లభించుటలో చట్టపరమైన ప్రిక్రియను పూర్తి చేసేందుకు సహకరించిన  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ బుధవారం కలెక్టరేట్ లో శాసనసభ్యులు దాస్యం వినయ్ భాప్కర్ ఆద్వర్యంలో ఎం.జి.ఎం కాట్రాక్ట్ సొసైటీ ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మాట్లాడుతూ పేషెంట్లు, వైద్యాధికారుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వహించాలని సొసైటీ ఉద్యోగులకు స్పష్టం  చేశారు. సొసైటీగా ఏర్పాడి ఎమర్జెన్సీ ల్యాబ్, ఫార్మాసి, కంప్యూటర్ ఆపరేటింగ్, ఇ.సి.జి., ఇ.ఇ.జి., ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సిటి-స్కాన్, తదితర కీలకమైన 18  విభాగాలలో  ఎటువంటి అంతరాయం కలుగకుండా 3 షిప్టులలో 24 గంటల పాటు అందుబాటులో ఉండి పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.జి.ఎం. హాస్పిటల్ కాంట్రాక్ట్ ఎంస్లాయిస్ సొసైటీ అధ్యక్షులు జె.భిక్షపతి, ఉపాధ్యాక్షులు జి.సతీష్, జనరల్ సెక్రటరి ఎం.ఎ.మహమూద్ అన్సారి, కోశాధికారి ఎ.సుకుమార్, సంయుక్త కార్యదర్శి టి.మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.