భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కన్నుమూత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కన్నుమూత

హైదరాబాద్ హైదరాబాద్ ఆగష్టు 27  (way2newstv.com)
భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య.. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భట్టాచార్య మృతిపట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ఐపీఎస్ అధికారులు నివాళులర్పించారు. భట్టాచార్య సేవలను ఉత్తరాఖండ్ పోలీసులు గుర్తు చేసుకున్నారు.
భారతదేశ తొలి మహిళా మాజీ డీజీపీ కన్నుమూత

1973 బ్యాచ్‌కు చెందిన భట్టాచార్య.. ఉత్తరాఖండ్ తొలి మహిళా డీజీపీగా 2004లో నియామకం అయ్యారు. 2007, అక్టోబర్ 31న పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేశారు.తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ కాగా, కంచన్ చౌదరి భట్టాచార్య ఐపీఎస్ సాధించిన రెండో మహిళగా ఘనత సాధించారు. భట్టాచార్య హిమాచల్‌ప్రదేశ్‌లో జన్మించారు. అమృత్‌సర్ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ అభ్యసించారు. 1993లో ఆస్ట్రేలియాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.