అమెరికా టూర్ లో జగన్ బిజీబిజీ

న్యూయార్క్, ఆగస్టు 17, (way2newstv.com)
అమెరికా పర్యటనలో బిజీ, బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వాషింగ్టన్ చేరుకున్న సీఎంకు ఎన్‌ఆర్‌‌ఐలు, వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌ (ఐఏఎస్‌)లు జగన్‌ను కలిసి ఆహ్వానించారు. అనంతరం భారత రాయబారి హర్హవర్ధన్ ష్రింగ్లా ఆహ్వానం మేరకు విందుకు హాజరయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతో జగన్‌ సమావేశమయ్యారు. వాషింగ్టన్‌‌లో యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో జగన్ ప్రసంగించారు. 
అమెరికా టూర్ లో జగన్ బిజీబిజీ

పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని సీఎం స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందన్నారు. తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడిదారులకు చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూములు, కరెంటు, నీరు సమకూర్చిపెడతామన్నారు. ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమేనని.. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. అలాగే జగన్.. యూఎస్ క్యాన్సులేట్ జనరల్ జోయల్ రిచర్డ్, బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ ఎఫైర్స్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ థామస్‌లతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు
న్యూ లుక్ లో జగన్
ఆగస్టు 18న మళ్లీ వాషింగ్టన్‌ చేరుకొని.. వ్యాపార సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆగస్టు 19, 20, 21న తన వ్యక్తిగత పనులతో ముఖ్యమంత్రి బిజీగా గడపనున్నారు. ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొన్ని సంస్థల ప్రతినిధులను కలుస్తారు.. తర్వాత అదే రోజు రాత్రి 8:30 గంటలకు అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగి బయల్దేరతారు. మరోవైపు అమెరికా పర్యటనలో మూడు రోజులు వ్యక్తిగత పనులు ఉండటంతో జగన్‌.. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా ఖర్చులు సొంతగా భరిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. జగన్ తన చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్పించనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అధికార, అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో 3 రోజులు వ్యకిగత పనులు ఉండటంతో ప్రభుత్వం నుంచి సీఎం జగన్ ఎలాంటి ఖర్చులు తీసుకోవడం లేదట. 
Previous Post Next Post