ప్రమాదమని తెలిసినా తప్పని ప్రయాణం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రమాదమని తెలిసినా తప్పని ప్రయాణం

ఆర్టీసీ బస్సుల లోటు
ప్రవేట్ ఆటోల జోరు
వనపర్తి ఆగస్టు 23, (way2newstv.com)
గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లోటు కావడంవల్ల ప్రవేట్ ఆటోలలో ప్రయాణం ప్రమాదమని తెలిసినా కూడా తప్పని పరిస్థితి ఏర్పడిందని మహిళా ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గోపాల్పేట మండలంలో అనేక గ్రామాలు, గిరిజన తండాలు ఉండడంవల్ల వారికి ఆర్టీసీ బస్సులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రవేట్ ఆటో లకు అంతు లేకుండా పోయింది. మండల కేంద్రంలోని బస్టాండ్ లో మరియు గ్రామాల్లోని బస్టాండ్ లో ఎక్కడ చూసినా కూడా ఆటోలకు అంతులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆటో లే తమకు శరణ్య మంటూ వాటిల్లో ప్రయాణిస్తున్నారు. 
ప్రమాదమని తెలిసినా తప్పని ప్రయాణం

దీనిని అదునుగా తీసుకున్న ఆటోడ్రైవర్లు అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ఆటోలో సుమారు 20 మందికి పైగా ఎక్కి ప్రయాణించడం వల్ల ఏ సమయంలో ఏం జరుగుతుందోనని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆటో ఇరువైపుల వెనుకభాగం నిలబడేచేసే ప్రయాణం చూపరులను తీవ్ర భయభ్రాంతులు చెందిస్తున్నాయి. వీటికి తగ్గట్లుగానే గ్రామం వెలుపల, మొదట్లో స్పీడ్ బ్రేకర్లు ఉండడం, ఎవరి ఇష్టానుసారంగా వారు రోడ్డుపై గుంతలు తీయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకపక్క ఆటోలో ప్రయాణం మరో ప్రక్క రోడ్లు అంతంత మాత్రంగానే ఉండడం వల్ల ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. దీని దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సుల సౌకర్యం కలిగించాలని గ్రామాల మహిళలు, ప్రజలు, యువకులు, విద్యార్థులు కోరుతున్నారు.