పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

 పోలవరం ఆగస్టు 08,(way2newstv.com): 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు.  పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. 
పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే 

ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి  నేరుగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వేకు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని  వరద ముంపుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
Previous Post Next Post