మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.
జగిత్యాల  ఆగస్టు 08  (way2newstv.com):
మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో,వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వచ్ఛ హరితమిషన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే ,మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ ,జిల్లా మైనారిటి సంక్షేేమ అధికారి వరద రాజన్ లతో కలసి కోరుట్ల పట్టణంలోని కల్లూరు ,ఏకిన్ పూర్ రోడ్లు ,మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటి వాటిని ట్రీ గాడ్స్ ఏర్పాటు చేశారు.
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

ఆనంతరం మైనారిటీ రెసిడెన్షియల్ విద్యార్థులకు స్కూల్ బ్యాంగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ హరితమిషన్ కార్యక్రమానికి ప్రజలు ,అధికారులు  ప్రతిష్టాత్మకంగా చేపట్టి , విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.హరితహారంలో పట్టణ పరిసర ప్రాంతాలలో 6 లక్షల లక్ష్యంగా మొక్కలను నాటి ,వాటిని రక్షించి ముఖ్యమంత్రి విధించిన లక్ష్యాన్ని చేరుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ తోట నారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, తహశీల్దార్ కోమల్ రెడ్డి,  మున్సిపల్ కమిషనర్ అయాజ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, తాజామాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డమీది పవన్,తాజా మాజీ కౌన్సిలర్లు,  ఐకేపీ ,ఆర్పీలు,మున్సిపల్ సిబ్బంది, టీఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలులు పాల్గొన్నారు.