వెబ్‌సైట్‌లో పంచాయతీ కార్యదర్శి పరీక్ష హాల్‌టికెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వెబ్‌సైట్‌లో పంచాయతీ కార్యదర్శి పరీక్ష హాల్‌టికెట్లు

విజయవాడ, ఆగస్టు 29 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఏర్పాటుకానున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చేపడుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి నియామక పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. పరీక్షలు పగ‌డ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రం ఇస్తామని కొంతమంది దళారులు అభ్యర్థులను మోసం చేస్తున్నారని.. ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నామంటున్నారని.. 
వెబ్‌సైట్‌లో పంచాయతీ కార్యదర్శి పరీక్ష హాల్‌టికెట్లు

ఇందుకోసం సదరు అభ్యర్థుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అడుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు.ప్రభుత్వం పారదర్శకంగా సచివాలయ ఉద్యోగాల పరీక్షలు నిర్వహించనుందని.. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి పెద్దిరెడ్డి కోరారు. ఇలా మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కార్యాలయం, ఆయా శాఖల కార్యదర్శుల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి స్పఫ్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సాంకేతికపరమైన సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే పరీక్ష OMR షీట్ల ముద్రణ పూర్తయిందని.. కట్టుదిట్టమైన భద్రత మధ్య OMR షీట్లను జిల్లాలకు తరలిస్తున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్‌రూంలలో భద్రపరుస్తామని.. ప్రత్యేక భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారని మంత్రి వెల్లడించారు.