యాదాద్రి ఆగస్టు 5, (way2newstv.com)
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కేంద్రంలో మహిళలు నాగులచవితి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని యాదాద్రి కొండ పైకి వెళ్లే దారిలో గల నాగులమ్మ పుట్ట వద్ద మహిళా భక్తులు ఘనంగా నాగులమ్మ పుట్టకు పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ కొంత మంది మహిళలు గత 30సం:రాల నుండి నాగులచవితి పర్వదినం రోజు నాగుల పుట్టలో పాలు పోసి పూలు, పండ్లు నైవేద్యం పెట్టి నాగమ్మ తల్లిని కొలుస్తున్నామన్నారు.
గుట్టలో నాగులచవితి
ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే నాగుల చవితి పర్వదినం పురస్కారించుకుని మహిళలు పాము పుట్టలలో పాలు పోసి వివాహం కానివారు సంతానం లేనివారు కోర్కెలు కోరుకుంటారు. ఈ నాగుల పంచమి పర్వదినం రోజు పుట్టలో పాలుపోసి నాగులమ్మను కోరుకుంటే సకలం సిద్దిస్తాయని మహిళల ప్రగాడ నమ్మకం అందుకే మహిళలు ఈ శ్రావణమాసంలో ఉప వాసాలు చేసి వ్రతాలు చేయడం మహిళల ఆనవాయితిగా ఈ మాసంలో మెుదటి మహిళా వ్రతం నాగులమ్మ నోముతో ప్రారంభం అవుతాయి.
Tags:
News