భయం గుప్పిట్లో కొండ వాసులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భయం గుప్పిట్లో కొండ వాసులు

మూడు వార్డుల్లో జనాల్లో భయం భయం
విశాఖపట్టణం, ఆగస్టు 20, (way2newstv.com)
మబ్బు కనిపిస్తే అందరికి ఎంతో ఆనందం. కానీ కొండవాలు ప్రాంత వాసులకు మాత్రం ఆందోళన. చినుకు పడితే చాలు.. వీరి గుండె జారిపోతుంది. వాన వస్తుందన్న వార్త వింటే చాలు గుండె అరచేతిలో పట్టుకుని భయంతో కూర్చోంటారు. నిశీది సమయం, నిర్థపోతున్న వేళ, కొండ చరియలు రూపంలో ఎక్కడ ఉపద్రం ముంచుకొస్తుందోనని బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతుంటారు. ఈ భయానికి తోడు ఈ ప్రాతంలో ప్రభుత్వం మౌలిక సదుపాయల కల్పన మాట మరిపోయింది. తాగునీటి సమస్య వీరిని వెంటాడుతోంది. చిన్నారులు సైతం నీటి మోస్తున్నారు అంటూ సమస్య తీవ్రత అర్థమవుతోంది...స్థానికంగా ఉన్న 1, 2, 10 వార్డుల పరిధిలో ఉన్న కొండవాలు ప్రాంతాలున్నాయి. దాచుకున్న రూపాయలతో సొంత గూడు కోసం తక్కువగా వస్తుందని ఆశపడి కొండవాలు ప్రాంతాల్లో స్థలాలు కొనుకొన్ని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అద్దెల సమస్య తీరినా మరిన్ని సమస్యలు వీరిని వెంటాడుతూనే ఉన్నాయి. 
భయం గుప్పిట్లో కొండ వాసులు

ప్రభుతం ఈ ప్రాంతాలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. కనీసం తాగునీటిని సైతం అందించలేదు. పై వరుసలో ఉన్న ఇళ్లకు వెళ్లాలంటే మెట్ల మార్గాలే శరణ్యం. ఉన్న మెట్లు కూడా నాచుతో నిండి, మరమ్మతుకు గురై ఉన్నాయి. తల్లిదండ్రుల పడుతున్న అవస్థలను చూసి చిన్న పిల్లలు సెలవు రోజుల్లో కింద నుంచి కుళాయిలు, బొర్ల వద్దకు వెళ్లి నీటిని తెస్తున్న దృష్యాలు చూస్తుంటే ఎవరైనా చెలించకమానరు. వారికున్న సమస్యల్లో వర్షాలు ఒకటి, వర్షాకాలంలో ఈ ప్రాంతవాసలుఉ నిత్యం ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన బండరాళ్లు ఇళ్లపై పడతాయేమోనని భయంగా ఉంటుందని ఇక్కడి వారు వాపోతున్నారు. హుదుద్‌ తుపాను సందర్భంగా 1, 2 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ఇద్దరికి స్వల్ప గాయాలైన కారణంగా ఇక్కడి ప్రజలను ఈ భయం వెంటాడుతోంది. పదో వార్డు పరిధిలో నివాసాలకు సమీపంలో ఉన్న మరుగుదొ డ్లు నిరుపయోగం గా ఉన్నాయి. వాటిని కూల్చేసి ఆ స్థానంలో మంచినీటి ట్యాంకు ను నిర్మించాల న్న ప్రతిపాదన ఏళ్లు గడుస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదంటున్నారు స్థానికులు. దీంతో కొందరు స్థానికులు చెత్తా చెదారాలను అదే చోట పారబోస్తున్నారు. ఆ స్థలాన్ని మరికొందరు బహిర్భూమిగా వినియోగిస్తున్నారు. అటుగా వెల్లాలంటే ముక్కు మూసుకుని వెల్లాల్సిందే.తమకు ఇంటి కుళాయిలు మంజూరు చేస్తామని కొంత కాలంగా అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఇంటికుళాయిలు మంజూరు చేయలేదు. ఇప్పటికైనా ఇంటి కుళాయిలు మంజూరు చేస్తు ఇక్కడ ప్రజల తాగునీటి సమస్య కొంత వరకూ తీరుతుంది. ఇప్పటికైన అధికారులు చెబుతున్న మాటలు నిలబెట్టుకోవాలి.