వాతావరణ శాఖ
హైదరాబాద్ ఆగస్టు 2, (way2newstv.com)
థాయ్లాండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 4న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రవేశించనుంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు
ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయి. దీంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Tags:
telangananews