మరో మూడు రోజులు వానలే..వానలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరో మూడు రోజులు వానలే..వానలు

హైద్రాబాద్, ఆగస్టు 7, (way2newstv.com
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా చాలా ప్రాంతాలను వాన ముసురు కప్పేసింది. ఐతే మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. 
మరో మూడు రోజులు వానలే..వానలు

రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.ఇక తెలంగాణలో ఇవాళ రాత్రి నుంచి చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఏపీ విషయానికొస్తే..కోస్తాంధ్రలో ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. , గురు, శుక్ర వారాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.