డొక్కా మాణిక్య వరప్రసాద్
గుంటూరు ఆగష్టు 23 (way2newstv.com)
వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర విభజన సమయంలో పరిపాలనకు భవనాల్లేని పరిస్థితి ఉంది. తెలుగు ఆత్మగౌరవం కోసం ప్రపంచ స్ధాయి రాజధానిని నిర్మించాలనే లక్ష్యంతో చంద్రబాబు అమరావతి నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు ల్యాండ్ పూలింగ్ విధానంలో స్వచ్ఛందంగా భూములనిచ్చారన్నారు. రాజధాని నిర్మాణానికి వివిధ ఫైనాన్షియల్ కంపెనీలు సహకరించాయని తెలిపారు.
అమరావతిపై వైసీపీ నేతలకు ఎందుకంత ద్వేషం
అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయాలని విభజనకు ముందే విభజన కమిటీకి సూచించినవారిలో తాను ఒకడినని తెలిపారు. అమరావతి ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించారని, ఆ ప్రదేశంలో బుద్ధుడు నడయాడాడని, అమరావతి నుంచి తెలుగు సంస్కృతి ప్రారంభమైందని తెలిపారు. అమరావతికి ఉన్న చరిత్రను పరిగణలోకి తీసుకుని, 13 జిల్లాలకి మధ్యలో, అందరికి అనుకూలంగా ఉంటుందనే ప్రజాభిప్రాయంతో చంద్రబాబుగారు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని తెలిపారు. దేశంలోని అనేక రాజధాని ప్రాంతాలు నదీ తీరంలోనే ఉన్నాయని, నదీతీరప్రాంతంలోనే నాగరికిత అభివృద్ది చెందుతుందని చెప్పారు.కానీ వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం అమరావతి ప్రాంతంలో రాజధాని సాధ్యం కాదు, ఆ ప్రాంతం ముంపుకు గురవుతుందంటూ తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ భూమిలిచ్చిన రైతల్ని గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. రాజధానికి కేంద్రం నిధులిస్తామన్నా వద్దని వైసీపీ ప్రభుత్వం అంటోందని, అమరావతిపై వైసీపీకి ఎందుంత ద్వేషమన్నారు. దీన్ని ప్రజలంతా ఖండిచాలన్నారు. అమరావతిపై ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రజలు క్షమించరన్నారు. ప్రభుత్వం అమరావతిపై స్ప్టష్టమైన ప్రకటన చేయాలన్నారు. రాజధాని ప్రాంతంలో ఎక్కువగా దళితులున్నారని, వైసీపీ నేతలు తమ స్వార్దం కోసం రాజధానికి భూములిచ్చిన రైతుల జీవితాల్ని నాశనం చేయొద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ ఆవేశంగా, అనాలోచితంగా నిర్ణయాలు తీసకుంటూ రాష్ట్రాన్ని తిరోగమనంవైపు తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు పాలనలో శరవేగంగా నిర్మాణాలు జరిగాయని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. పోలవరంలో అవినీతి జరిగిందంటూ అసత్య ఆరోపణలు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారన్నారు. పోలవరంలో అవినీతి జరిగితే మళ్లీ అదే కంపెనీ నవయుగ కూడా టెండర్లలో పాల్గొనవచ్చని ఎందుకు చెప్పారని నిలదీశారు. పీపీఏలు, రివర్స్ టెండరింగ్‌పై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి మెట్టికాయలు వేసినా బుద్ది రాలేదన్నారు. చంద్రబాబు నిర్మిస్తున్న బందరు పోర్టును జగన్ రద్దు చేశారన్నారు. ఇలాంటి విధానాలతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలుచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ఆలోచనలకనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు.
Tags:
Andrapradeshnews