పాయల్ రాజ్ పుత్ `ఆర్డీఎస్ లవ్` ఫస్ట్ లుక్ని లాంచ్ చేసిన విక్టరీ వెంకటేశ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాయల్ రాజ్ పుత్ `ఆర్డీఎస్ లవ్` ఫస్ట్ లుక్ని లాంచ్ చేసిన విక్టరీ వెంకటేశ్

పాయల్ రాజ్ పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ` ఆర్డీఎస్ లవ్`. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ని విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ ఎంటైర్ యూనిట్ కి  అభినందనలు తెలిపారు. 
పాయల్ రాజ్ పుత్ `ఆర్డీఎస్  లవ్` ఫస్ట్ లుక్ని లాంచ్ చేసిన విక్టరీ వెంకటేశ్

ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్ తొ పాటు `పవర్` డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసి యూనిట్ కి అభినందనలు తెలిపిన వెంకటేశ్ కి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, నిర్మాత సి.కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్ సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  
నటీనటులు: 
పాయల్ రాజ్ పుత్, తేజస్ కంచెర్ల, వి.కె.నరేశ్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు