హైద్రాబాద్, ఆగస్టు 16, (way2newstv.com)
హైదరాబాద్ సిటీలో జనానికి మెట్రో మరింత చేరువైంది. ఇకపై ప్రతి మూడు నిమిషాలకు ఓ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. జూబ్లీ చెక్‌పోస్ట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం లేక ఇప్పటివరకు 8 నిమిషాలకు ఒక రైలు నడిచింది. అయితే ఇప్పుడు రివర్సల్ సదుపాయం అందుబాటులోకి రావడంతో పీక్ అవర్స్‌లో 3 నిమిషాలు, నాన్‌పీక్ అవర్స్‌లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానున్నట్లు మెట్రో వెల్లడించింది. మెట్రో సర్వీసులకు గ్రేటర్ సిటీజన్ల నుంచి ఆదరణ పెరుగుతున్న క్రమంలో అందుబాటులోకి వచ్చిన కొత్త విధానం వారిని మెట్రోకి మరింత దగ్గర చేయనుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
మరింత చేరువగా మెట్రో
ప్రయాణికుల సంఖ్య ఇప్పటివరకు సరాసరిన వారానికి 5వేల నుంచి 6 వేల వరకు పెరుగుతుందని, బుధవారం వరకు మెట్రో ప్రయాణికుల సంఖ్య 3.6 లక్షలకు చేరుకున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.), నాగోల్–హైటెక్ సిటీ (28 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. హైటెక్ సిటీ, అమీర్‌పేట్, ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర స్టేషన్లలో ప్రయాణికుల రద్ధీ ఎక్కువగానే ఉంది. హైటెక్ సిటీ-రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ (1.1 కి.మీ.) మార్గంలో మెట్రో పట్టాలు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, స్టేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.ఈ నెలాఖరులో ఈ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఎంజీబీఎస్-జేబీఎస్ (10 కి.మీ.) మార్గంలో డిసెంబర్ నుంచి మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో పనులు, స్టేషన్లు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ పనుల పూర్తయ్యాయి.
ఒకే రోజు 3 లక్షల మంది ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం మెట్రో రైళ్ళలో దాదాపు 3.06 లక్షల మంది ప్రయాణించారు. ప్రయాణికులు ఈ సేవను ఉపయోగిస్తుండడంతో కొత్త రికార్డు సృష్టించామని తెలిపారు. హైటెక్ సిటీ రివర్సల్ పనులు అన్ని విధాలుగా పూర్తయ్యాయని తెలిపారు. భద్రతా అనుమతులు వచ్చిన కొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, హైటెక్ సిటీ మధ్య సాధారణ రైలు సేవలను ప్రారంభిస్తామని చెప్పారు.మెట్రో రైలు సేవలను మరింత పెంచనున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల్లో హిటెక్ సిటీకి అన్ని మార్గాల్లో మెట్రో సేవలను పెరుగనున్నట్లు చెప్పారు. అవసరమైతే గరిష్ట సమయంలో 5 నిమిషాలు లేదా 3 నిమిషాలకు మెట్రో సేవలను పెంచనున్నట్లు తెలిపారు.మైండ్‌స్పేస్ Jn. స్టేషన్) వరకు పనులు కూడా పూర్తయ్యాయని...హైటెక్ సిటీ, రాయదు ర్గ్ స్టేషన్ల మధ్యలో ట్రయల్ పరుగులు ప్రారంభమవుతాయని చెప్పారు. హెచ్‌ఎంఆర్ ప్రాజెక్ట్ ఇప్పటికే 75 కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుందని తెలిపారు
Tags:
telangananews