నిండుకుండలను తలపిస్తున్నకృష్ణ పరివాహక ప్రాంతాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిండుకుండలను తలపిస్తున్నకృష్ణ పరివాహక ప్రాంతాలు

కర్నూలు ఆగష్టు 7   (way2newstv.com)
ఎగువన కురుస్తున్న వర్షాలకు నదీ ప్రవాహం భారీగా పెరగటంతో.కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీని పరిధిలోని ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. వరద నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోగా.. దిగువన ఉన్న ప్రాజెక్టులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి.
ఆల్మట్టి: పూర్తిస్థాయి నీటి మట్టం 1,705 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 1697.05 అడుగులకు చేరింది. దీని పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 99  టీఎంసీల నిల్వ ఉంది. ఈ జలాశయానికి ఇన్ ఫ్లో 3,62,875 క్యూసెక్కులు నమోదు కాగా.. 3,90,072 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.
నిండుకుండలను తలపిస్తున్నకృష్ణ పరివాహక ప్రాంతాలు  

నారాయణపూర్:పూర్తిస్థాయి నీటిమట్టం 1,615 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1604.33 అడుగులకు చేరింది. దీని పూర్తి స్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 24.34 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఇన్‌ఫ్లో 3,39,775 క్యూసెక్కులు కాగా.. 3,71,517 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల : పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 1041.11 అడుగులకు చేరింది. దీని పూర్తి స్థాయి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.33 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి 2,70,725 క్యూసెక్కులు నీరు వస్తుండగా.. 2,92,492 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి 2,41,945 క్యూసెక్కుల మేర నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 871.30 అడుగుల మేర నీరు చేరింది. ఇక ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 147.27 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం నుంచి 82,925 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర :జలాశయానికి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1612.44 అడుగులు ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 40.14 టీఎంసీలుగా ఉంది. తుంగభద్రకు 4,741 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. 1,042 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ :పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 510.60 అడుగులు మేర ఉంది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 132.69 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్‌కు 55,554 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. 858 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.