వరంగల్, ఆగస్టు 6, (way2newstv.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డ ను పరిశీలించారు. హెలికాప్టర్ లో పయనిస్తూ. ఎరియల్ వ్యూ ద్వారా, మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. తరువాత గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసారు. అక్కడ అమ్మవారికి వాయినం సమర్పించారు. ఈ సందర్బంగా మేడిగడ్డలో గోదావరి ప్రవాహ ఉధృతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మేడిగడ్డను పరిశీలించిన సీఎం కేసీఆర్
వ్యూ పాయింట్, వంతెనపై నుంచి దిగువకు విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.సీఎం వెంట మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ సంతోష్కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు, పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ స్వాగతం పలికారు.
Tags:
telangananews