హైదరాబాద్ ఆగష్టు 27 (న్యూస్ పల్స్)
లాలాపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమ్మతు పనులు అత్యంత మందకోడిగా సాగడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాలాపేట్ ఆర్.ఓ.బి మరమ్మతు పనుల పురోగతిని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శంకరయ్య, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ లతో కలిసి నేడు ఉదయం పరిశీలించారు.
లాలాపేట్ ఆర్.ఓ.బి మరమ్మతు పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మేయర్ రామ్మోహన్
ఆర్.ఓ.బి మరమ్మతు పనులు ప్రారంభమై మూడు నెలలకుపైగా అయినప్పటికీ పనులు మందకోడిగా కొనసాగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మరమ్మతు పనులను వేగవంతంగా చేపట్టేందుకు అదనపు లేబర్ ను నియమించడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణకు ఇంజనీర్లను నియమించాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తార్నాక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Tags:
telangananews