దొనకొండలో రియల్ బూమ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దొనకొండలో రియల్ బూమ్

ఒంగోలు, ఆగస్టు 23, (way2newstv.com)
ఏపీలో వైఎస్సార్ తన కలలు నెరవేర్చుకుంటోంది. 2014లో ఇక గెలుపు లాంఛనమే అనుకుని సుమారు 10 వేల ఎకరాలు కొన్నారట ఆ పార్టీ నేతలు. అయితే... సీన్ రివర్స్ కావడంతో వారి డబ్బులన్నీ 5 సంవత్సరాలు బ్లాక్అయ్యాయి. ఇక అధికారం వచ్చింది. ఇప్పటికే లేటయ్యింది. అన్నట్టు... దొనకొండను తెరమీదకు తెస్తోంది వైసీపీ ప్రభుత్వం. తమ పార్టీ వారికి జరిగిన నష్టాన్ని భారీ స్థాయిలో పూడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. చిత్రవిచిత్రమైన కారణాలన్నీ చూపి దొనకొండను రాజధాని లేదా కనీసం రెండో రాజధానిగా చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. 
దొనకొండలో రియల్ బూమ్

ఈ మేరకు రాజధాని మార్పుకు సంకేతాలు ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స. అయితే... గెజిట్ ప్రకారం రాజధాని మార్పు అన్నది అంత సులువైన పని కాదు. అందుకే గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో అమరావతిని అలా ఉంచి... అభివృద్ధిని మొత్తం దొనకొండకు తరలించే ప్రయత్నం జరుగుతోందని టాక్.రాజధాని మార్పు, అమరావతిపై అసంతృప్తి నేపథ్యంలో... ఇప్పటికే ప్రచారంలో ఉన్న దొనకండలో రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తోంది. వేలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ వాలిపోయారు. దీనికి సోషల్ మీడియా ప్రచారం కూడా తోడవడంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే వైసీపీలో కొందరు సమాచారం తెలిసిన నేతలు తాజా కొనుగోళ్లు కూడా జరిపారని సమాచారం. ఈ నేపథ్యంలో ముందే దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. 100 గజాల సైటు నుంచి వంద ఎకరాల బిట్టు వరకు అన్నిటికీ డిమాండే. అమరావతిలో ల్యాండ్ కొనలేకపోయామన్న బాధలో ఉన్న వారు కూడా హమ్మయ్య మరో ఛాన్సు వచ్చిందన్నట్టు పరుగెడుతున్నారు.ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. అయితే నిన్నటి రేటు ఈరోజు లేదు. ఈరోజు రేటు రేపు ఉండదు. ఇక ప్రభుత్వ ప్రకటన వచ్చేలోపు ఎకరా 50 లక్షలకు పోయినా ఆశ్చర్యం లేదు. పైగా దొనకండ కాకుండా వేరే ఆప్షన్ కూడా ఏం లేకపోవడంతో కచ్చితంగా అది ఒక వెలుగు వెలుగుతుందన్నది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అంటే... ఏపీ పారిశ్రామిక రాజధానిగా మారినా చాలు...భూములు కోట్లలోకి చేరుకుంటాయి. ఇక స్థానికులు అయితే... మాకు పండగొచ్చిందన్నట్టు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
=