అమరావతి ఆగష్టు 22 (way2newstv.com)
శుక్రవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. " శ్రీ కృష్ణుడి ఇచ్చిన శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తుచేస్తుందని, ఆరోజును పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారన్నారు.
శ్రీకృష్ణాజన్మాష్టమి పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు
ఈ శ్రీకృష్ణజన్మాష్టమి సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి పునాదిని ధృవీకరిస్తుందని" గవర్నర్ హరిచందన్ సందేశమిచ్చారు. ఈ శుభ సందర్భం శాంతి, పురోగతి మరియు శ్రేయస్సుతో ప్రజలు వర్థిల్లాలని, రాష్ట్ర ప్రజలలో సోదరభావం, స్నేహం మరియు సామరస్యాన్ని మరింత బలోపేతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.