తరుణ్ కాదు... రాజ్ తరుణ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తరుణ్ కాదు... రాజ్ తరుణ్

హైద్రాబాద్, ఆగస్టు 20   (way2newstv.com):
రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం ఊహించని మలుపు తిరిగింది. యాక్సిడెంట్ కి గురైన కారు హీరో తరుణ్ ది కాదు యువ హీరో రాజ్ తరుణ్ ది అని తేలింది. అల్కాపురి టౌన్ షిప్ దగ్గర రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కు గురైంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ కారుని అక్కడే వదిలేసి పారిపోయాడు. కారులో తరుణ్ తో పాటు నిర్మాత రామ్ తుళ్లూరి ఉన్నట్టు తెలిసింది. అర్థరాత్రి వేగంతో ఓఆర్ఆర్ పై ర్యాష్ డ్రైవింగ్ చేశాడు తరుణ్. అదుపు తప్పి రోడ్డు గార్డెన్ ఫెన్సింగ్ ను ఢీకొట్టాడు. కారు పక్కకి ఒరిగింది. ఆ వెంటనే రాజ్ తరుణ్ కారుని వదిలి పరుగులు పెట్టాడు. సీసీ కెమెరాలో రాజ్ తరుణ్ పారిపోతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ కారు వదిలి పారిపోవడం అనుమానాలకు దారితీసింది. 
తరుణ్ కాదు... రాజ్ తరుణ్

ఈ ప్రమాదం నుంచి రాజ్ తరుణ్ సేఫ్ గా బయటపడ్డాడు.కాగా, ఈ కారు హీరో తరుణ్ ది అని వార్తలు వచ్చాయి. రోడ్డు ప్రమాదం నుంచి తరుణ్ ప్రాణాలతో బయటపడ్డాడని మీడియాలో న్యూస్ వచ్చింది. ఆ కారు తరుణ్ ది అని అనుకున్నారు. దీనిపై స్వయంగా తరుణ్ స్పందించాడు. యాక్సిడెంట్ వార్తలను ఖండించాడు. ఆ న్యూస్ ఫేక్ అని చెప్పాడు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నాడు. నేను ఇంట్లోనే ఉన్నాను, ఆ కారు నాది కాదు అని తరుణ్ క్లారిటీ ఇచ్చారు.  యాక్సిడెంట్ న్యూస్ ఫేక్ అని తరుణ్ వివరణ ఇచ్చాడు. ''అది ఫేక్ న్యూస్. యాక్సిడెంట్ వార్తలు చూసి షాక్ అయ్యాను. నేను చాలా హెల్తీగా ఉన్నా. ఇంట్లోనే ఉన్నా. ఆ కారు నాది కాదు. నా కారు జాగ్వార్. ఇంట్లోనే ఉంది. అసలు నాకు సంబంధమే లేదు. ఈ న్యూస్ ఎందుకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఏదన్నా న్యూస్ వేసే ముందు ఒక్కసారి నిజానిజాలు కనుక్కుని ప్రసారం చేస్తే బాగుంటుంది. పొద్దున నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. నా బంధువులు, స్నేహితులు, అభిమానులు ఫోన్లు చేస్తున్నారు. అది ఫేక్ న్యూస్ అని అందరికి చెప్పాను'' అని తరుణ్ స్పష్టం చేశాడు.