ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదేశం
హైదరాబాద్‌ఆగష్టు 14 (way2newstv.com)
రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ రాసింది. ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో పలు సాంకేతిక, మానవ తప్పిదాలు జరిగాయి. 
ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి 

ఫలితంగా పలువురు విద్యార్థులు తప్పడం, కొందరికి మార్కులు తగ్గడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు జులై 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు.27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని వివరించారు. ఆయా విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. 27 మంది విద్యార్థుల పూర్తి వివరాలను భాజపా నేతలు తాజాగా రాష్ట్రపతికి పంపించారు.