గ్రామ సచివాలయ పరీక్షలకు హాల్ టిక్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామ సచివాలయ పరీక్షలకు హాల్ టిక్కెట్లు

విజయవాడ, ఆగస్టు 29, (way2newstv.com)
గ్రామ/వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించననున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే సెప్టెంబరు 1న నిర్వహించనున్న 'కేటగిరీ-1'లోని మొత్తం పోస్టులతో పాటు, కేటగిరీ-3లోని డిజిటల్ అసిస్టెంట్ రాతపరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేసిన ప్రభుత్వం.. సెప్టెంబరు 3, 4 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షల హాల్‌టికెట్లను బుధవారం (ఆగస్టు 28) విడుదల చేసింది. ఇక సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో జరిగే పరీక్షల హాల్‌టికెట్లు ఆగస్టు 30న విడుదల చేయనుంది.
గ్రామ సచివాలయ పరీక్షలకు హాల్ టిక్కెట్లు

ఇక సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో నిర్వహించే పరీక్షల హాల్‌టికెట్లను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ ఐడీ లేదా దరఖాస్తు ఐడీ లేదా ఆధార్‌ నెంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌‌టికెట్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అక్టోబరు 2 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఆయా సచివాలయాల్లో మొత్తం 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జులై 26న వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆగస్టు 11 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గ్రామ సచివాలయ పోస్టులకు మొత్తం 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష రాసిన రోజే ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. పరీక్షలు పూర్తయిన 15 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించనున్నారు. 
గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టులు..
✦ పంచాయతీ కార్యదర్శి 
✦ వీఆర్వో 
✦ సర్వే అసిస్టెంట్ 
✦ ఏఎన్‌ఎం 
✦ వెటర్నరీ/ ఫిషరీస్ అసిస్టెంట్ 
✦ మహిళా పోలీసు & ఉమెన్-చైల్డ్ 
✦ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 
✦ ఎనర్జీ అసిస్టెంట్ 
✦ అగ్రికల్చర్/హార్టికల్చర్ ఎంపీఈవో 
✦ డిజిటల్‌ అసిస్టెంట్ 
✦ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్. 

వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టులు..
✦ కార్యదర్శి 
✦ మౌలిక వసతుల కార్యదర్శి 
✦ శానిటేషన్ కార్యదర్శి 
✦ విద్యా కార్యదర్శి 
✦ ప్రణాళిక కార్యదర్శి 
✦ వెల్ఫేర్ సెక్రెటరీ 
✦ డెవలప్‌మెంట్ సెక్రెటరీ 
✦ ఇంధన కార్యదర్శి 
✦ ఆరోగ్య కార్యదర్శి 
✦ రెవెన్యూ కార్యదర్శి 
✦ మహిళా సంరక్షణ కార్యదర్శి. 
సచివాలయ పోస్టులు, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..