మారిపోయిన సచివాలయం....

హైద్రాబాద్, ఆగస్టు9, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వాధినేతలు ఏ కార్యక్రమానికైనా ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు చూస్తున్నారు. అన్ని విషయాల్లోనూ మూడనమ్మకాలను పాటిస్తుం డటం గమనార్హం. తాజాగా బూర్గుల రామకృష్ణా రావు (బీఆర్‌కే) భవన్‌ నుంచే పరిపాలనా వ్యవహా రాలు సాగించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశిం చారు. అది కూడా శుక్రవారం నుంచే జరగాలంటూ హుకుం జారీ చేశారు. 'శ్రావణమాసం, అందునా శుక్రవారం అందుకే మీరిప్పటి నుంచి సచివాలయానికి కాకుం డా నేరుగా బీఆర్‌కే భవన్‌కే వెళ్లండి.. 
మారిపోయిన సచివాలయం....

అక్కడి నుంచే పరిపాలన సాగిం చండి...' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో  సీఎస్‌ ఎస్‌కే జోషీనీ, మిగతా ఉన్నతాధికారులు పనులు ప్రారంభించారు. అయితే సచివాలయం లోని పలు శాఖలు ఇంకా తరలింపు దశలోనే ఉండటం గమనార్హం. పలు కీలక ఫైళ్లు, బీరువాలను, సామాగ్రినీ ఇంకా తరలిస్తూనే ఉన్నారు. ఈ అంశం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం, శాఖాధిపతులు తరలింపు ప్రక్రియను వేగవంతం చేయలేదు. దీంతో పలు డిపార్టుమెంట్ల పరిపాలనా వ్యవహారాలన్నీ సచివాలయం నుంచే కొనసాగతున్నాయి. ఈ క్రమంలో ఉన్నఫళంగా బీఆర్‌కే భవన్‌కే వెళ్లండి.. అక్కడి నుంచే పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టండని కేసీఆర్‌ ఆదేశించటంతో అధికారులు విస్తుబోతున్నారు. ఇది తమకు ఇబ్బందికరమేగాక, పరిపాలనకు కూడా సంక్లిష్టమేనని ఆర్థికశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా సీఎం ఆదేశాల మేరకు బీఆర్‌కే భవన్‌ నుంచే వ్యవహారాలు సాగించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధపడుతున్నారు.
Previous Post Next Post