ముగ్గురిలో సూచరితే బెటర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముగ్గురిలో సూచరితే బెటర్

విజయవాడ, ఆగస్టు 10, (way2newstv.com
ఏపీలో ఏర్పడిన జగన్‌ ప్రభుత్వానికి రెండు నెలలు నిండాయి. కేబినెట్‌ కూర్పుతోనే శభాష్‌ అనిపించుకున్న ఆయన అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మహిళలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురు మంత్రులకు కేబినెట్‌ ఛాన్స్‌ ఇచ్చారు. వీరిలో ఒకరికి అందునా ఎస్టీ వర్గానికి చెందిన పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం హోదా కల్పించి, ఎస్టీ మంత్రిత్వ శాఖను ఆమె చేతిలో పెట్టారు. ఇక, ఎస్సీ సామాజిక వర్గానికిచెందిన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో హోంశాఖ పగ్గాలను అందించారు.
ముగ్గురిలో సూచరితే బెటర్

అదే సమయంలో మరో ఎస్సీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన తానేటి వనితకు మహిళా శిశుసంక్షేమ శాఖను అప్పగించారు. ఇలా ముగ్గురు మహిళలకు కేబినెట్‌లో అందునా అత్యంత బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రులుగా ఇవ్వడం జగన్‌ సాహసోపేత నిర్ణయంగా రాజకీయ నిపుణులు అప్పట్లోనే విశ్లేషించారు. అయితే, ఇంత మంచి స్థానాలను పొందిన వీరు ఏం చేస్తున్నారు? జగన్‌ వ్యూహాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారా? జగన్‌ ఆలోచనల నుంచి పుట్టిన నవరత్నాలను అమలు చేయడంలోను, రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించ డంలోనూ ముందున్నారా? అంగన్‌ వాడీ వంటి కీలకమైన శాఖలు ఉన్న మహిళా సంక్షేమ శాఖ పనితీరు ఎలా ఉంది? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ ముగ్గురు మహిళా మణుల శాఖ, వారి పనితీరును మదింపు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.వీరిలో సుచరిత విషయాన్ని తీసుకుంటే.. ముగ్గురు మహిళా మంత్రుల్లోనూ కొంచెం దూకుడు ప్రదర్శిస్తున్న మంత్రిగా ఈమె తొలి ర్యాంకు సొంతం చేసుకున్నారు. కీల‌క‌మైన హోం శాఖా మంత్రిగా ఉన్న ఆమె అధికార పక్షం చేస్తున్న విమర్శలకు ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు భద్రత విషయంలో వచ్చిన ఆరోపణలకు దీటుగానే సమాధానం చెప్పారు. ఇక, టీడీపీ నేతల రగడ, హత్యలకు సంబంధించి కూడా ఆమె సరైన విధంగానే స్పందించారు. మీడియాకు చాలా దగ్గరగా ఉంటూ.. వారి సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతున్నారు. దీంతో సుతరిత ఫర్వాలేదని అనిపిస్తున్నారు.అదే సమయంలో గిరిజన సంక్షేమ మంత్రి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిని తీసుకుంటే.. ఈమె సుచరిత కన్నా వెనుక బడ్డారు. మీడియాకు పెద్దగా అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటివరకు కేవలం రెండు మూడు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. అధికారులపై పెద్దగా అజమాయిషీ కూడా పెద్దగా లేదు. అయితే, నవరత్నాల అమలు విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. దీంతో ఈమె రెండో ర్యాంకును కౌవసం చేసుకున్నారు. మరో మంత్రి తానేటి వనిత అస్సలు మీడియా ముందుకు రావడం కానీ, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం కానీ చేయడం లేదు. దీంతో ఈమె మూడో స్థానానికే పరిమితమయ్యారు. విశేషం ఏంటంటే.. ముగ్గురూ గ్రాడ్యుయేషన్‌ చేసిన వారే కావడం, పార్టీలో ఆటుపోట్లు తిని ఎదిగిన వారే కావడం గమనార్హం. వీరిలో సుచ‌రిత ఒక ఉప ఎన్నిక‌తో క‌లుపుకుని మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, పుష్పశ్రీ వాణి, తానేటి వ‌నిత ఇద్దరు రెండేసిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జ‌గ‌న్ ఎన్నో ఆశ‌ల‌తో ఏకంగా ముగ్గురు మ‌హిళ‌ల‌కు త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తే వీరిలో సుచ‌రిత‌కు మాత్రమే ఓ మోస్తరు మార్కులు ప‌డుతున్నాయి.