నిధులు అడగకుండా ఫిర్యాదులు చేస్తున్నారు.

గుంటూరు(way2newstv.com)
కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటే పార్టీ అంత ఉత్సాహంగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం  ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు.  23 సీట్లు ఇచ్చే అంత తప్పు తానేమీ చేయలేదన్నారు.  తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు. నా కష్టాన్ని ప్రజలు గుర్తించలేకపోయారన్న బాధ వుంది. తాము మొదలెట్టిన ప్రపంచ స్థాయి రాజధాని నేడు వెలవెల బోతుందన్నారు. 
నిధులు అడగకుండా ఫిర్యాదులు చేస్తున్నారు.

తమపై కోపంతో అమరావతిని చంపేశారన్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటి? ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విదేశాలకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని.. నేడు విమానాలన్నీ ఆగిపోయాయన్నారు.  ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు చాలా తక్కువ వడ్డీకే ఆ నిధులు ఇచ్చారని, ఆ నిధులను ఏపీ ప్రభుత్వం పోగొట్టిందని విమర్శించారునిన్న ఢిల్లీ వెళ్లిన జగన్.. ప్రధానిని కలిసి అమరావతిలో ఏదో జరిగిందని చెప్పారని... కానీ జరగనిదానిని మీరు నిరూపించలేరన్నారు. ప్రధానిని కలిస్తే రాష్ట్రానికి నిధులు అడగాలి కానీ జగన్ మాత్రం అభివృద్ధి వదిలి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
Previous Post Next Post