యడ్డీకి అంత వీజీగా ఏమి లేదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యడ్డీకి అంత వీజీగా ఏమి లేదు

షా ఓకే అంటేనే కేబినెట్ లో బెర్తులు
బెంగళూర్, ఆగస్టు 1, (way2newstv.com)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే ఆయనకు గతంలో మాదిరిగా ఫ్రీ హ్యాండ్ ఉండదు. కీలక నిర్ణయాల్లో సయితం కేంద్ర నాయకత్వం అనుమతులు తప్పనిసరి. ఇలా కేంద్ర నాయకత్వం యడ్యూరప్పపై నిఘా ఉంచింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాలేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. అవినీతి ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గతంలో పదవి నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీ అధినాయకత్వం ఆయనను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టేందుకు కొంత సందేహించింది.
యడ్డీకి అంత వీజీగా ఏమి లేదు

కానీ బలమైన లింగాయత్ వర్గానికి చెందని నేత కావడంతో చివరకు ఆయననే ఫైనల్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న కర్ణాటకలో పార్టీ నేతల వ్యవహార శైలి కారణంగా బలహీన పడే ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నది కేంద్ర నాయకత్వం ఆలోచన. నాలుగు రాష్ట్రాలు మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా కర్ణాటకలో మాత్రం యడ్యూరప్ప కు టైట్ చేయాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఒకవైపు గవర్నర్ వాజూబాయి వాలాతో పాటుగా ముఖ్యమైన నేతలను కొందరిని యడ్యూరప్ప నిర్ణయాలుపై నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. “ఆయన పేరుకే ముఖ్యమంత్రి. ఆయనకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు లేవు” అని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం ఇందుకు అద్దం పడుతోంది. స్పీకర్ ఎంపిక విషయంలోనూ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవ్వడం ఇందుకు ఉదాహరణ.ఇక మంత్రి వర్గ విస్తరణలోనూ యడ్యూరప్పకు ఎలాంటి అవకాశాలూ కేంద్ర నాయకత్వం ఇవ్వదలచుకోలేదు. కాకుంటే తొలుత బీజేపీ రాష్ట్ర కార్యవర్గానికి మంత్రి వర్గ సభ్యుల జాబితాను సిద్దం చేయమని ఆదేశాలు అందాయి. ఈ జాబితాను యడ్యూరప్ప కేంద్ర నాయకత్వం వద్ద పెట్టాల్సి ఉంటుంది. అమిత్ షా టిక్ పెడితేనే వారు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇలా యడ్యూరప్ప ను కేంద్ర నాయకత్వం అన్ని రకాలుగా టైట్ చేసిందన్నది కన్నడనాట బీజేపీలో విన్పిస్తున్న టాక్.