మద్దికేర ఆగస్టు 27, (way2newstv.com)
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి నివేశన స్థలం కొరకు నిర్వహిస్తున్న సర్వేలలో వాలంటీర్లు నిమగ్నమయ్యారు.మద్దికెర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో ఉన్న 40 మంది వాలంటీర్లు తమ పరిధిలోని గల ఇంటికి వెళ్లి ఇంటి నివేశన స్థలం కొరకు సర్వేలు నిర్వహిస్తున్నారు.40 మంది వాలంటీర్లకు కావలసిన స్టేషనరీను రెవెన్యూ సిబ్బంది అందజేశారు.
సర్వే లో నిమగ్నమైన వాలంటీర్లు
రెవెన్యూ అధికారులు వాలంటీర్లు నిర్వహించవలసిన విధి విధానాల గురించి తెలియజేశారు.సర్వే పూర్తి చేసిన అనంతరం వాలంటీర్లు దరఖాస్తులను అధికారులకు అందజేసి ఆన్లైన్ చేయించాలని అధికారులు తెలియజేశారు.వీలైనంత త్వరగా తమ పరిధిలోని హౌసింగ్ సర్వేను పూర్తి చేయాలని అధికారులు వాలంటీర్లకు తెలియజేశారు.సర్వే నిర్వహించిన దరఖాస్తులను పరిశీలించడానికి మండల అధికారులు సూపర్వైజర్ల నియమించారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు పకీరప్ప,రంగప్ప, పంచాయతీ కార్యదర్శి సాలే బోఖారియా, వీఆర్ఏ పీరా మరియు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.