తెలంగాణలో రెడ్లు... ఆంధ్రాలో కమ్మ సామాజిక వర్గం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో రెడ్లు... ఆంధ్రాలో కమ్మ సామాజిక వర్గం

కమలం కొత్త స్ట్రాటజీ
హైద్రాబాద్, ఆగస్టు 21, (way2newstv.com)
ద‌క్షిణాదిలో క‌మ‌ల వికాసం చేయించాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న బీజేపీ నాయ‌కులు.. అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రు త‌మ‌కు అనుకూలంగా ఉంటార‌నే విష‌యంలో వారు అనేక వ‌డ‌పోతల అనంతరం.. తాజాగా ఓ నిర్ణయానికి వ‌చ్చార‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం పెరిగిన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా వ‌ర్గాల‌కు తాము బ‌ల‌మైన చోటు క‌ల్పిస్తామ‌నే ధీమాను వ్యక్తం చేస్తూ.. క‌మ‌లనాథులు ముందుకు సాగాల‌ని నిర్ణయించుకున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి.ఈ క్రమంలోనే తెలంగాణ‌, ఏపీల్లో క‌మ‌లం పార్టీ నాయ‌కులు సామాజిక వ‌ర్గాల‌కు ముఖ్యంగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు గేలం వేసే ప‌నిలో ప‌డ్డారు. 
తెలంగాణలో రెడ్లు... ఆంధ్రాలో కమ్మ సామాజిక వర్గం

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో రెడ్లు.. బీజేపీకి టార్గెట్‌గా మారార‌ని తెలుస్తోంది. ఇక్కడ వాస్తవానికి రెడ్లు కాంగ్రెస్‌కు ఆది నుంచి కూడా అండ‌గా ఉంటున్నారు. అనేక మంది రెడ్డి నాయ‌కులు కీలక‌  ప‌ద‌వుల్లో ఉంటే.. త‌మ త‌మ బిజినెస్‌ల‌కు ఏ అడ్డూ ఉండ‌ద‌ని భావించి.. రెడ్డి సోద‌రులు గుండుగుత్తుగా కాంగ్రెస్‌ను బ‌ల‌ప‌రిచిన ప‌రిస్థితి ఉంది.అయితే, ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ ముక్కలు చెక్కలు కావ‌డం, స‌రైన నాయ‌క‌త్వం లేక పోవ‌డంతో రెడ్లు ఎటు వెళ్లాలో తెలియ‌క అయోమ‌యంలో ఉన్నారు. పోనీ.. అధికార టీఆర్ఎస్ వైపు వెళ్తాదామా? అంటే.. అది జ‌రిగే ప‌ని కాదు. ఆది నుంచి వెల‌మ‌ల‌తో రెడ్డి వ‌ర్గం పోరు చేస్తోంది. కేసీఆర్ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావ‌డంతో త‌న వైపు మొగ్గని రెడ్లను ముప్పుతిప్పులు పెడుతున్నార‌ని రెడ్డి వ‌ర్గం గుస్సాగా ఉంది. ఈ నేప‌థ్యంలో రెడ్ల వీక్‌నెస్‌ను గుర్తించిన బీజేపీ త‌న‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మకంగా పావులు క‌దిపింది.ఈ క్రమంలోనే ఈ సామాజిక వ‌ర్గానికి చెందిన డీకే అరుణ వంటివారితోపాటు.. కోమ‌టిరెడ్డి సోద‌రుల్లో ఒక‌రికి గేలం వేసింది. అరుణ ఇప్పటికే జాయిన్ అయ్యారు కూడా. త్వర‌లోనే మ‌రింత ముమ్మరంగా వ్యవ‌హ‌రించి రెడ్డి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగాల‌ని నిర్ణయించుకుంది. ఇప్పుడు తెలంగాణ‌లో రెడ్లకు అధికారం కావాలి. ఈ క్రమంల‌నే వారు బీజేపీ అండ‌దండ‌లో రాజ‌కీయంగా అక్కడ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు ఏక‌మ‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. రెడ్లు గుండుగుత్తుగా వైసీపీ వైపు ఉన్నారు. మ‌రో ప్రధాన , ఆర్థికంగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం క‌మ్మ. నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా టీడీపీవైపు ఉన్న వీరు ఇప్పుడు పంథా మార్చుకునేందుకు సిద్ధమ‌వుతున్నారు. తాము టీడీపీలో ఉన్నా.. ఇప్పుడు ఆశించిన విధంగా గుర్తింపు ల‌భించే ఛాన్స్ లేద‌ని వీరంతా చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఈ వ‌ర్గంలో చాలా మంది అన్ని విధాలా గుల్లయ్యారు.మ‌రోప‌క్క, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా టీడీపీ పుంజుకునే విష‌యంలో చాలా సందేహాలు ఉన్నాయి. దీంతో వీరు కూడా ప‌క్క చూపులు చూస్తున్నారు. వీరిలో రాయ‌పాటి వంటి కీల‌క‌మైన నాయ‌కులు జంపింగ్‌కు రెడీ అయ్యారు. ఇప్పటికే సుజ‌నా, వ‌ర‌దాపురం సూరి లాంటి క‌మ్మ నేత‌లు పార్టీ మారిపోయారు. కేశినేని నాని లాంటి వాళ్లు అదే బాట‌లో ఉన్నారు. వీరిని ఆస‌రా చేసుకుని క‌మ‌లం క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌ద‌పాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇలా ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల‌ను రెండు రాష్ట్రాల్లోనూ త‌న గుప్పిట్లో పెట్టుకుంటే పార్టీ ఎదుగుతుంద‌ని క‌మ‌ల నాథులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
=