పేద వర్గాల అభ్యున్నతికోసం కార్యక్రమాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పేద వర్గాల అభ్యున్నతికోసం కార్యక్రమాలు

ఏలూరు, ఆగష్టు 10 (way2newstv.com)
విద్యా, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్ది ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కోట్లాది రూపాయలు కేటాయించారని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు  ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని ) చెప్పారు. స్థానిక బెనర్జీపేటలోని బాలగంగాధర తిలక్ నగర పాలక సంస్కృతోన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ వేడుకలు మరియు పూర్వవిద్యార్థుల అపూర్వసమ్మేళనం కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  నాని మాట్లాడుతూ బడుగు బలహీన, పేద వర్గాల అభ్యున్నతికోసం ముఖ్యమంత్రి  జగన్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు మంచి విద్య, ఆరోగ్యం అందించినప్పుడే భావి భారత పౌరులుగాతయారుకాగలన్నారు.
పేద వర్గాల అభ్యున్నతికోసం  కార్యక్రమాలు 

50 సంవత్సరాలక్రితం ఈ పాఠశాల చిన్న షెడ్ లో చాలీచాలని సౌకర్యాలతో ఉండేదని ఇప్పుడు అన్ని మౌళిక సౌకర్యాలతో మంచి విద్యాప్రమాణాలతో విరాజిల్లుతోందని అన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉన్నతస్థాయి ఉద్యోగాలలో స్డిరపడ్దారని అన్నారు. మరిఇంకా ఎంతోమంది వ్యాపారవేత్తలుగా, రాజకీయనాయకులుగా, సంఘ సేవకులుగా మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించారని చెప్పారు. పాఠశాలలో చదివి స్థిరపడిన పూర్వవిద్యార్థులు కూడా తమ వంతు సహకారం అందించి పాఠశాల అభివృద్దిలో భాగస్వాములు కావడం అందరికీ స్పూర్తిదాయకమని శ్రీ ఆళ్లనాని అభినందించారు. పూర్వవిద్యార్థులంతా ఒకచోటచేరి స్వర్ణోత్సవ వేడుగలు ఘనంగా జరుపుకోవడం చాల గొప్పవిషయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్దికి తన సహకారం అవసరమైతే తనదృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ పరంగా వెంటనే తనవంతు సహకారం అందిస్తానని  ఆళ్ల నాని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాలలో పనిచేసిన పూర్వఉపాధ్యాయులు వి బాపూజి,  కె .గౌరీశంకర్ ,  జె వీరభద్రరావు  ప్రసాదరాజు తదితరులను  ఆళ్ల నాని చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి శ్రీ రాము సూర్యారావు, ప్రముఖ వ్యాపారవేత్త కె .కుమార్ గుప్తా, డిఇఒ  సివి రేణుక, ఏలూరు నగరపాలక కమీషనర్  డి .చంద్రశేఖర్ , ఉపవిద్యాశాఖాధికారి  డి .ఉదయకుమార్ , నగరపాలక స్కూల్స్ సూపర్ వైజర్ కె . రామమూర్తి, పూర్వవిద్యార్థులసంఘ నాయకులు కె.శ్రీనివాసరావు, బి.శంకర్ , సుధాకర్ , నాగరాజు, నగేష్ తదితరులు పాల్గోన్నారు.