పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల

కర్నూలు, ఆగస్టు 6, (way2newstv.com)
కర్నూలు, ఆగస్ట్ 6: శ్రీశైల జలాశయం వెనుక జలాల నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రేగులెటర్ ద్వారా సాగు, త్రాగు నీటిని విడుదల చేశామని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. మంగళవారం జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ లతో కలిసి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 5 గేట్లు ఎత్తి  సాగునీటిని విడుదల చేసారు. అనంతరం ప్రవాహ నీటికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి  కొబ్బరికాయ కొట్టి పూలు, ఫలాలు ప్రవాహం నీటిలో వదిలారు. 
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 263.09 మీటర్ల నీతిమట్టం నమోదు అయిందని విడుదలైన నీటిని వాటా మేరకు హంద్రీనీవా, గాలేరు  నగరి, తెలుగు గంగ కాలువలకు మళ్లీస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. శ్రీశైల జలాశయంలో ప్రస్తుతం  866.08 అడుగుల మేర 130 టీఎంసీల నీటి నిలువ ఉందని జూరాల ప్రాజెక్టు నుండి దాదాపు 3.2 లక్షల క్యూసెక్ లా నీరు ప్రవాహం ఉందని నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో సాయంత్రానికి పోత్తిరెడ్డి పాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా క్రమక్రమంగా దాదాపు 10 వేల క్యూసెక్కుల వరకు పెంచుకుంటూ నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి వీరపాండియన్ తెలిపారు. పోతిరెడ్డిపాడు లో నీరు లభ్యం గా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా అయిన కారణంగా నీటిని వదలడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆయన అన్నారు. నీటి విడుదలపై ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తూ నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి, ఎస్ ఈ రామచంద్ర మూర్తి, కర్నూల్ ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు, సంబంధిత ఈఈ లు, డిఈలు తదితరులు పాల్గొన్నారు.. ఈ ప్రాజెక్టు నుండి రాయలసీమ లోని నాలుగు జిల్లా కు సాగు నీటితో పాటు ప్రకాశం .నెల్లూరు, చెన్నై కు త్రాగునీరు అందించన్నారు