ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

హైదరాబాద్ ఆగష్టు 6  (way2newstv.com
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం గుత్తా సుఖేందర్‌రెడ్డితో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి హాజరయ్యారు.  శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 
ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీ నర్సింహాచార్యులు గత సోమవారం అధికారికంగా ప్రకటించి.. గుత్తాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. 2021 జూన్ మూడు వరకు గుత్తా ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.కాగాశాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని  కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ పార్లమెంట్ సభ్యునిగా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా,  పలు కీలక పదవుల్లో పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పార్టీకి చేసిన సేవలను గుర్తించుకొని మంచి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో అవకాశం కల్పించారు, ఈ సందర్భంగా రాజేశం గౌడ్ గారు మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.  గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసిన వారిలో  చొప్పదండి మాజీ శాసనసభ్యులు, కోడూరు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..