నయా లుక్ లో బాలయ్య - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నయా లుక్ లో బాలయ్య

హైద్రాబాద్, ఆగస్టు 20  (way2newstv.com):
రోజు రోజుకీ పెద్ద హీరోలు కుర్ర హీరోలకు పోటీగా మారిపోతున్నారు. మన్మధుడు2 సినిమా లుక్స్ లో యంగ్ హీరోలకు పోటీలా నాగార్జున కనిపించారు. తరువాత ఇటీవల చిరంజీవి సాహో తరువాతి మూవీ కోసం తన లుక్స్ పూర్తిగా మార్చేసి మళ్లీ అప్పటి చిరులా మెరుస్తున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య బాబు వంతు. నందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 
నయా లుక్ లో బాలయ్య

ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా యూనిట్. కొత్తరకం గెడ్డం తో.. నిండైన సూటుతో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తున్నారు.  'ఐరన్ మ్యాన్' లో టోనీ స్టార్క్ పాత్ర పోషించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ను గుర్తుకు తెస్తున్న ఈ లుక్ అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. కళ్ళజోడు.. సూటు.. గెడ్డం అసలు సిసలు నందమూరి సింహం ఇలా ఉంటుంది అంటూ నందమూరి అభిమానులు సంబ్రపదిపోతున్నారు. ఇప్పుడు ఈ నందమూరి ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.