రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు

ఎరువులు, విత్తనాలపై ఖచ్చితమైనా లెక్కలు తీసుకోండి 
భూసార పరీక్షల కార్డులు వెంటనే రైతులకు అందజేయాలి
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 
హైదరాబాద్, ఆగష్టు 06 (way2newstv.com)
రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు పూర్తిగా వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారని, ఈ నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఎలాంటి కొరత రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్క్ ఫెడ్ మరియు విత్తనశాఖలపై ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొమరంభీం, నారాయణపేటలలో సాధారణం కన్నా అత్యధిక వర్షాపాతం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో సాధారణకన్నా తక్కువ, మిగతా అన్ని జిల్లాలలో సాధారణ వర్షాపాతం నమోదయిందని అధికారులు మంత్రి గారికి వివరించారు. 
రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు

తాజా పరిస్థితుల నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు జిల్లాల వారీగా డిమాండ్ ఎంత ఉంది ? ప్రస్తుతం ఎక్కడ ఎంత నిల్వ ఉంది ? ఎంత అవసరం ఉంటుంది ? జిల్లాల వారీగా పరిశీలించి ఎక్కడా ఎరువులు, విత్తనాలు తక్కువ కాకుండా సిద్దంచేయాలని అధికారులను అదేశించారు.ఎరువులు, విత్తనాల సరఫరా విషయంలో ప్రాథమిక సహకార సంఘం, మార్క్ ఫెడ్ శాఖల వద్ద ఎలాంటి జాప్యం జరగకూడదని మంత్రి అన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో మాట్లాడి ఎంత ఆయకట్టుకు సాగునీరు రాబోతున్నది క్షేత్రస్థాయిలో ఖచ్చితమయిన అంచనాలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వస్తున్న నకిలీ ఎరువుల నివారణకు కలెక్టర్ల సహకారంతో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్), గులాబీ రంగు కాయతొలుచు పురుగు (పింక్ బౌల్ వార్మ్) పత్తి పంటలో రాకుండా ప్రతి మొక్కనూ కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజూ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించాలని అన్నారు. భూసార పరీక్షలకు సంబంధించిన పరీక్ష కార్డులను సంబంధిత రైతులకు 15 రోజులలో అందజేయాలని, రైతుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం వెంటనే అప్ లోడ్ చేయాలని అదేశించారు. ఎరువులు, పురుగుమందుల నిల్వకోసం గోదాంలను జిల్లాల వారీగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రబీలో వేరుశనగ విత్తనాల కొరత రాకుండా ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలని, ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే లక్షా 50 వేల క్వింటాళ్లు అవసరం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక నివేదికను తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించి పథకాల వారీగా నివేదిక అందజేస్తే ఆ పథకాల నుండి రాష్ట్రాలకు నిధులు ఎలా రాబట్టగలమో సమీక్ష చేద్దామని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఎవరికీ నష్టంలేకుండా అందరికీ ఆమోదయోగ్యమయిన నివేదిక తయారుచేయాలని ఆదేశించారు. అవసరం అయితే ఒక కమిటీ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.