ఆలయ అర్చకులతో సమావేశం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆలయ అర్చకులతో సమావేశం

జోగులాంబ గద్వాల ఆగస్టు 19 (way2newstv.com)
అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఇ ఆలయ ముఖ్య అర్చకులు మరియు అర్చకస్వాములు తో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ప్రేమ్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలు వారి వారి బాధ్యతలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతపురం పుణ్యక్షేత్రానికి ప్రముఖుల రాక ఎక్కువగా ఉంటుందని ఈక్రమంలో అర్చక స్వాములు అనవసరమైన సెలవులు పెట్టరాదని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని వారు సూచించారు
ఆలయ అర్చకులతో సమావేశం 

 అదేవిధంగా వారోత్సవాల్లో భాగంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే రథోత్సవ కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు రెండు చోట్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు ప్రతిరోజు ప్రాతఃకాలం రుద్ర నమక చమకం శ్రీ సూక్తం పారాయణం చేయాలని సూచించారు విశేష రోజులలో ఆలయ ముఖ్య అర్చకుల తో పాటు అందరూ అర్చక స్వాములు కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని సూచించారు భక్తుల సౌకర్యాల దృష్ట్యా ప్రాత కాలం ఆలయాలను త్వరగా తెరిచి భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు దేవస్థానానికి వచ్చే భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు