విశాఖపట్టణం, ఆగస్టు 30, (way2newstv.com)
ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ స్కూట్ విశాఖపట్టణంలో తన సేవలను ప్రారంభించనుంది. విశాఖ నుంచి సింగపూర్‌కు నేరుగా విమానాలను నడపనుంది. ఈ సేవలు అక్టోబరు నుంచి ప్రారంభమవుతాయని స్కూట్ ప్రతినిధులు తెలిపారు. సిల్క్ ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులను నిలిపివేసిన నేపథ్యంలో దాని స్థానంలో స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానాలను నడుపుతుంది వెల్లడించారు.
విశాఖ టూ సింగపూర్ డైరక్ట్ ఫ్లైట్
సిల్క్ ఎయిర్ విమానంతో పోల్చితే స్కూట్ విమానాల్లో 48 సీట్లు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. బుధవారం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సింగపూర్ టూరిజం బోర్డు, స్కూట్ ప్రతినిధులను కలిసి ప్రభుత్వ అనుమతుల విషయంలో తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానాలు విశాఖ-సింగపూర్ రూట్లో వారంలో 5 రోజులు పాటు నడుస్తాయి. ఆది, సోమ, బుధ, శుక్ర, శని విమానాలు సేవలు అందుబాటులో ఉంటాయి. సింగపూర్ కాలమానం ప్రకారం రాత్రి 08.45 గంటలకు విమానం బయలుదేరి రాత్రి 10 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 11 గంటలకు విశాఖలో బయలుదేరి ఉదయం 05.45 గంటలకు సింగపూర్ చేరుకుంటుంది. ఇక ప్రారంభ ఆఫర్‌గా టికెట్ ధరను రూ.4500 (వన్ సైడ్)గా నిర్ణయించారు. రానుపోను రూ.10లోపే ఉంటుంది. ఈ రూట్లో సాధారణంగా టికెట్ ధరలు రూ.16వేల పైనే ఉంటుంది.