పాలనలో బిజీగా జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాలనలో బిజీగా జగన్

విజయవాడ, ఆగస్టు 5 (way2newstv.com):
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జెరూసలెం పర్యటన నుంచి తిరిగొచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎంకు ఉన్నతాధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముఖ్యమంత్రి నేరుగా తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. గోదావరి వరద, ముంపు గ్రామాల్లో పరిస్థితిపై అధికారుల్ని అడిగి ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 1న కుటుంబసభ్యులతో కలసి సీఎం జెరూసలెం పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
పాలనలో బిజీగా జగన్

మూడు రోజుల పాటూ అక్కడ జగన్ పర్యటించారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లినా.. కొంత సమయాన్ని రాష్ట్రం కోసం కేటాయించారు. స్థానిక రైతుతో సంభాషించారు. అక్కడ అనుసరిస్తున్న నీటియాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడికోసం అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే హెడ్రాలో ఉన్న ఉప్పునీటి నుంచి మంచినీటి తయారు చేసే కేంద్రం (H21D డీశాలినేష ప్లాంట్)ను సందర్శించారు. ప్లాంట్ ఏర్పాటు, ఖర్చు, నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్‌లో ఉప్పు నీరును డీశాలినేషన్‌ ద్వారా మంచి నీరుగా మార్చే పద్దతి గురించి వివరాలు ఆరా తీశారు.. తర్వాత ఆ నీటిని జగన్ తాగి చూశారు. తర్వాత ప్లాంట్‌ ఏర్పాటు, ఎలా పని చేస్తుంది.. ఇలా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలపై డెమాతో ముఖ్యమంత్రికి వివరించారు. పర్యటనలో పలువురు తెలగువారు ముఖ్యమంత్రిని కలిశారు.