యాదాద్రి ఆగస్టు 17,(way2newstv.com):
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు జరిపారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీఎం అభివృద్ధి పనులు పరిశీలించారు. రాయగిరి, యాదగిరిగుట్ట మధ్యలో నరసింహ అరణ్యం... మినీ ట్యాంక్బండ్, రింగురోడ్డు పనులను పరిశీలించారు.
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
రింగ్ రోడ్డు నిర్మాణ పనులు, తర్వాత పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలించారు. ఆలయం చుట్టూ తిరుగుతూ సీఎం ఎక్కడికక్కడే సూచనలు చేశారు. పనుల తీరుతెన్నులను ఆర్కిటెక్చర్ ఆనంద్సాయి సీఎం కేసీఆర్కు వివరించారు. ఆలయం లోపల నిర్మాణ పనులపై సీఎం సూచనలు చేశారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం త్రిదండి చిన్నజీయర్ స్వామి సూచనల మేరకు సీఎం స్థల పరిశీలన చేసారు. ఇందుకోసం 100 ఎకరాల స్థలం కావాల్సి ఉండడంతో అనువైన ప్రాంతం గురించి చర్చించారు. యాగం నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేసారు. కేసీఆర్ వెంట సంతోష్కుమార్, మంత్రులు జగదీశ్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి... జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్ తదితరులు ఉన్నారు.
Tags:
telangananews