జూరాల గేట్లు ఎత్తివేత

మహబూబ్ నగర్, ఆగస్టు 9, (way2newstv.com)
జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువనున్న నారాయణపూర్ డాం నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో జూరాల లో 38 గేట్లు ఎత్తి సుమారుగా 4లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు, దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కిందకు వెళుతుంది ఈ వరద ప్రవాహం గత ఐదు రోజుల నుంచి కొనసాగడంతో జూరాల ప్రాజెక్టును ఆనుకొని ఉన్న పొలాలు బ్యాక్ వాటర్ వల్ల పూర్తిగా నీటిలో మునిగాయి ఇదే ప్రవాహం దాదాపు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. 
జూరాల గేట్లు ఎత్తివేత

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు లో సుమారుగా 9 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని గేట్ల ద్వారా 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది, ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు లో 4 లక్షల 45 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా నాలుగు లక్షల 45 వేలు ఔట్ ఫ్లో గా ఉన్నది జూరాల నుండి నెట్టెంపాడు ప్రాజెక్టు 2201 క్యూసెక్కులు, భీమా లిఫ్టు 1300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ కు 630 క్యూసెక్కులు, కుడికాలువకు 634 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 750 క్యూసెక్కులు వెళ్తున్నాయి, ఇ వరద ప్రవాహం ఇదేవిధంగా కొనసాగవచ్చని అధికారులు తెలిపారు
Previous Post Next Post