మేధో వర్గంలో శూన్యం ఆవహించినట్టయింది

జైట్లీ మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం
న్యూడిల్లీ ఆగష్టు 24 (way2newstv.com)
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. జైట్లీ కుటుంబానికి, ఆయన అనుయాయులకు తన సానుభూతి వ్యక్తం చేశారు. 
మేధో వర్గంలో శూన్యం ఆవహించినట్టయింది

ఆయన మృతి ప్రజాజీవితంపైనా, మేధావి వర్గంపైనా అపార ప్రభావం చూపుతుందని కోవింద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జైట్లీ నిష్క్రమణంతో శూన్యం ఆవహించినట్టయిందని అభిప్రాయపడ్డారు. ఆయన తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఎంతో బరువు బాధ్యతలను సైతం సమతూకంతో, అత్యంత అనురక్తితో, పరిపూర్ణ అవగాహనతో నిర్వర్తించారని ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి కొనియాడారు.
Previous Post Next Post