రాజమహేంద్రవరం ఆగష్టు 7 (way2newstv.com)
శుద్ధి చేసిన... పరిశుభ్రమైన మంచినీటి ప్రజలకు సరఫరా చేయాలని, గోదావరి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున మంచినీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ సూచించారు. స్థానిక కోలింగాల పేటలోని 10 ఎంఎల్‌టి ప్లాంట్‌ను బుధవారం మధ్యాహ్నం ఆమె పరిశీలించారు. గోదావరి నీటిని శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నగర ప్రజలకు శుద్ధిచేసిన పరిశుభ్రమైన మంచి నీటిని సరఫరా చేయాలన్నారు.
మంచినీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు
ప్రస్తుత వాతావరణం చాలా ప్రమాదకరమన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాచి చలార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. మంచి నీటి సరఫరా విషయంలో వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ వరద నీరు నేపథ్యంలో నిర్లక్ష్యం వహించకుండా బాగా శుద్ధి చేసిన మంచి నీటినే నగర ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. పైపు లైన్లకు ఎక్కడైనా డామేజ్లు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. లేకపోతే మంచి నీటిలో కలుషిత నీరు, వ్యర్థాలు చేరి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అటువంటి పరిస్థితికి ఆస్కారం ఇవ్వకుండా ముందుగానే మెలాక్కోవాలని పేర్కొన్నారు. మంచినీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. మాజీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్, అరిగేల బాబు నాగేంద్రప్రసాద్, బుడ్డిగ గోపాలకృష్ణ, గొర్రెల రమణి, బిక్కిన రవి, మళ్ల వెంకటరాజు, తులసి రావు గొగడ, తదితరులు వారి వెంట ఉన్నారు.
Tags:
Andrapradeshnews