సభాపతి హుందాతనాన్ని కాపాడుకోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సభాపతి హుందాతనాన్ని కాపాడుకోవాలి

విజయవాడ ఆగష్టు 13 (way2newstv.com
మంగళవారం తెలుగు దేశం పార్టీ  విస్తృతస్థాయి భేటీ జరిగింది. టీడీపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తదితర అంశాలను ప్రధానంగా చర్చ జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. ఎన్నికల అనంతరం టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై దాడి, ఆర్టికల్ 370 రద్దు,   కాశ్మీర్ సమస్య తదితర అంశాలపై విస్తృత చర్చ జరిపారు.  చంద్రబాబు మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసేలా జగన్,  కేసీఆర్ ఆలోచనలున్నాయని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శాశ్వతం కాదన్నారు. 
సభాపతి హుందాతనాన్ని కాపాడుకోవాలి

ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుని చేసే కార్యక్రమం కాదన్నారు. మన భూభాగం నుంచే నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టుకు ఆలోచనలు చేయాలన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ శ్రేణులపై 469 దాడులు జరిగాయని... 8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని అన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లను కూడా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీలు, ఇతర వత్తిళ్లకు లొంగి వైకాపా దాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదన్నారు. సభాపతి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకాలను ఎన్నడూ చూడలేదని అన్నారుమంచి నిర్ణయాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, అందులో భాగంగానే ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు పలికామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను అమలు చేస్తే ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దీనిని బట్టి ఇసుక దోపిడీకి ఎవరు పాల్పడ్డారో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.