మళ్లీ గోదావరికి వరద - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ గోదావరికి వరద

విజయవాడ, ఆగస్టు 20  (way2newstv.com):
ఇప్పటికే గోదావరి వరదలతో ఏపీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు వారికి మరో షాకింగ్ న్యూస్ వినిపించింది ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ). గోదావరికి మళ్లీ వరదలు రానున్నాయని హెచ్చరించింది. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. గోదావరికి భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. మంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మళ్లీ గోదావరికి వరద

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలన్నీ నీటితో నిండాయి. గోదావరి, దాని ఉప నదుల పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో 2 వారాలుగా గోదావరి నది నిండుకుండ‌లా మారింది. మరోవైపు కృష్ణాన‌ది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు దిగువకు ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టుల‌ు జ‌ల‌క‌ళ సంత‌రించుకున్నాయి.మ‌హారాష్ట్ర‌, కర్నాట‌క‌ల్లో కురుస్తున్న వ‌ర్షాలతో ఆల్మ‌ట్టి డ్యామ్ నిండింది. అక్క‌డి నుంచి దిగువ‌కు మిగులు జ‌లాలు విడుద‌ల చేయ‌డంతో నారాయ‌ణ‌పూర్, జూరాల‌, ప్రాజెక్టుల‌కూ వ‌ర‌ద తాకిడి క‌నిపిస్తోంది. ఇప్పుడు మరోసారి గోదావరి నదికి వరదలు వస్తాయని ఆర్టీజీఎస్ చేసిన హెచ్చకలతో అధికారులు, ప్రభుత్వం అలర్ట్ అయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.