రాజమహేంద్రవరం ఆగష్టు 19 (way2newstv.com)
రాజమహేంద్రవరంలో హఠాత్తుగా కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానిక ఆర్యాపురం, తుమ్మలావ, కృష్ణ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వర్షపునీటిలో పడుతున్న ఇబ్బందులను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) గుర్తించి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
హఠాత్తుగా కురిసిన భారీ వర్షం జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు
పరిస్థితిని గుర్తించిన ఆయన వెంటనే నగర పాలక సంస్థ ఎస్ఈ తో మాట్లాడి ఆ ప్రాంతంలోని వాల్ ఓపెన్ చేయించి వర్షపునీటిని ఏబి నాగేశ్వరరావు పార్కులోని చెరువులోకి మళ్లించారు. దీంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఆ ప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సమస్య పట్ల వెంటనే స్పందించి పరిష్కరించిన ఆదిరెడ్డి శ్రీనివాస్కు ఆయా ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కరగని వేణు, బుడ్డి గ రవి, వారి వెంట ఉన్నారు.
Tags:
Andrapradeshnews