అమరావతి ఆగష్టు 19 (way2newstv.com):
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ ఎమ్మెల్సీలుగా మోపిదేవి వెంకటరమణ, మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాన్ని ఇక్బాల్ అందుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీలుగా మోపిదేవి, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి ఏకగ్రీవం
కాగా, వైసీపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో, ప్రతిపక్ష టీడీపీ నుంచి ఎవరూ బరిలో నిలవలేదు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణా రెడ్డి.
Tags:
Andrapradeshnews